
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ ఆదేశానుసారం
ప్రైవేట్ ఆస్పత్రులపై తనిఖీ నిర్వహించడం జరిగినది
యోధ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తనిఖీ చేయడం జరిగినది
ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీదేవి పిఓఎంసి హెచ్ మాట్లాడుతూ ఆసుపత్రులలో సాధారణ కాంపులు ప్రోత్సహించాలని, అత్యవసరము అయితే తప్ప ఆపరేషన్‌తో కాన్పులు చేయకూడదని, తెలియజేసినారు
సిజేరిన్ ఆపరేషన్లలో రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొదటి స్థానంలో ఉన్నదని
ప్రతినెల విధిగా ఆపరేషన్ చేసినటువంటి వివరములు డిఎం అండ్ హెచ్ ఓ ఆఫీస్ లో సబ్మిట్ చేయాలని
అనవసరముగా ఆపరేషన్‌తో కాన్పులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని, గర్భసంచి తీయించుకున్న వారి వివరములు, అబార్షన్లు చేయించుకున్న వారి వివరములు ప్రతినెల డి ఎం అండ్ హెచ్ ఓ ఆఫీస్ లో సబ్మిట్ చేయాలని ఆదేశించినార
ఈ కార్యక్రమములో మాస్ మీడియా అధికారి శ్రీదేవి ఆసుపత్రి సిబ్బంది పాల్గొనినారు