
మాజీ ఎమ్మెల్యే గండ్ర ఆదేశాలతో అన్ని మండలాల్లో జననేత వేడుకలు.
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆదేశాలతో భూపాలపల్లి నియోజకవర్గంలోని శాయంపేట, గోరికొత్తపల్లి, రేగొండ, చిట్యాల, మొగుళ్లపల్లి, టేకుమాట్లా,ఘనపురం, భూపాలపల్లి మండలాల్లో తెలంగాణ రాష్ట్ర జాతిపిత, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రధాత,తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు,భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు 70వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.అన్ని మండల కేంద్రాల్లో కేక్ కట్ చేసి భూపాలపల్లి నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు,ప్రజల పక్షాన కేసీఆర్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.
రాష్ట్ర సాధనలో ప్రాణాలని సైతం లెక్కచేయకుండా సాగిన కేసీఆర్ చరిత్రని నెమరువేసుకుంటు సంబరాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ లు,జడ్పీటీసీ లు,మండల పార్టీ అధ్యక్షులు,మహిళ అధ్యక్షురాలు,యూత్ అధ్యక్షులు,సొసైటీ చైర్మన్ లు, ఏఎంసి చైర్మన్ లు,గౌరవ సర్పంచ్ లు,ఎంపీటీసీ లు,డైరెక్టర్ లు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.