
నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)
శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర కమలాపూర్ మండల కేంద్రం లో ఈ నెల 21 నుండి 24 వరకు సమ్మక్క గుట్ట వద్ద జరగనున్న జాతర పనులను శుక్రవారం దేవాదాయ శాఖ ఈఓ,జాతర ఇన్చార్జి వెంకట్రావు పరిచిలించారు.జాతర నిర్వహణ,ఏర్పాట్లు,భక్తులకు కల్పించే వసతులను జాతర నిర్వహణ కమిటీ తో చర్చించారు.జాతర సందర్భంగా అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ ఏర్పడకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ సమావేశములో జాతర కమిటీ చైర్మన్ ఆన్ కార్ అశోక్,డైరెక్టర్ లు మస్న చంద్రశేఖర్, వైనాల సాంబయ్య,మౌటం బాలాజీ,బండి రవి,శనిగరపు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.