ఉద్యమ కారుల కృతజ్ఞత సమావేశం

డా. పెరుమాండ్ల రామకృష్ణ చైర్మన్ ఉద్యమ కారుల ఫోరమ్

హన్మకొండ, నేటిధాత్రి:

హనుమకొండ జిల్లా ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఉద్యమ కారుల కృతజ్ఞత సమావేశము లో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రతి ఉద్యమ కారునికి 250 గజాల స్థలం, అర్హతను బట్టి ఉద్యోగం , ఉద్యమ కేసులు ఎత్తివేత అతి తక్కువ వడ్డీకి రుణాలు, పెన్షన్ లు , తెలంగాణ ఉద్యమ కారులని గుర్తించటానికి కమిటీ వేయాలి, ఉద్యమ కారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, ఉద్యమ కారుల భవన్ ఏర్పాటు చేయాలి, ఉద్యమ కారులకు నామినేటెడ్ పదవులలో ప్రాధాన్యం ఇవ్వాలి ఇంకా అన్ని రకాల అవసరాలు తెర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రేవంత్ రెడ్డి కి ఉద్యమ కారుల బాధలు తెలుసు కాబట్టి అన్ని రకాలుగా ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కెసిఆర్ ఉద్యమ కారులకు ద్రోహం చేసారని మండిపడ్డారు. ఉద్యమ కారులందరు బిఆరెస్ నాయకులును ప్రతి ఊరిలో మీకు జరిగిన అన్యాయన్ని గూర్చి నిలదియాలన్నారు. ఈ కార్యక్రమం లో కాకతీయ యూనివర్సిటీ ఉద్యమ నాయకులు చిర్ర రాజు హనుమకొండ జిల్లా అధ్యక్షులు రవీందర్ భూపాలపల్లి అధ్యక్షులు గట్టన్నా ములుగు రాజు వరంగల్ రఫీఉన్నిసా అజిజ్ పాలకుర్తి ప్రభాకర్ వర్దన్నపేట రమేష్ పరకాల కిరిటీ ఘనపూర్ మహేందర్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జ్యోతిరెడ్డి వివిధ జిల్లాల ఉద్యమ కారులు నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!