
# జిపి మల్టీపర్పస్ వర్కర్లకు ఘన సన్మానం.
నర్సంపేట,నేటిధాత్రి :
గ్రామపంచాయతీ పారిశుద్ధ కార్మికులు చేస్తున్న సేవలు ఎనలేనివి అని ఎంపిటిసి పెద్ది శ్రీనివాస్ రెడ్డి అన్నారు.సర్పంచులు,వార్డు సభ్యుల పడవికాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలనను ప్రభుత్వం మొదలు పెట్టింది.కాగా గ్రామ పంచాయితీల అభివృద్ధి పట్ల గత కొన్ని రోజులుగా వివిధ రకాల పారిశుద్ధ్య పనులు మొదలుపెట్టగా గురువారం పారిశుద్ధ్య పనుల ముగింపు కార్యక్రమాలను చేపట్టారు.ఈ సందర్భంగా నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామ పంచాయితీ కార్మికులను పంచాయితీ కార్యదర్శి శ్రావణ కుమారి అధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో జీపి సిబ్బందిని ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపిటిసి పెద్ది శ్రీనివాస్ రెడ్డి,ప్రత్యేక అధికారి రజినీ కాంత్ మాట్లాడుతూ మాట్లాడుతూ నిత్యం గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేస్తూ గ్రామాన్ని సుందరీకరణ చేయడంలో వారి సేవలు అద్భుతం అన్నారు. చెత్తాచెదారం లేకుండా చేసి దోమల ఎదుగుదల లేకుండా చేయడంలో వారి కృషి ఎనలేనిదని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిపి కార్మికులు కారోబార్ బాషబోయిన సుధాకర్,ఇప్ప ఎల్లయ్య,ఉప్పుల సురేందర్,యాదమ్మ, అంగన్వాడి టీచర్ జహ్రుబేగం,ఆశా వర్కర్ కోమల తదితరులు పాల్గొన్నారు.