
రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 15 , నేటిదాత్రి:
అహింస, జంతుబలిని నిషేధించడం, చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, గిరిజన లంబాడి ప్రజలు స్థిర నివాసం ఏర్పరచుకొని, మెరుగైన వ్యవసాయ విధానము నేర్చుకొని సుస్థిర జీవనాన్ని గడపాలని, ఐక్యంగా ఉండి సంస్కృతి సంప్రదాయాలు కాపాడుతూ భావితరాలకు ఆదర్శంగా ఉండాలని, సర్వ మతాలను సమానంగా చూస్తూ, పరులకు కీడు చేయకుండా, సమాజ అభివృద్ధి కోసం పరిరక్షణ కోసం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ప్రబోధనలను భావితరాలకు అందించవలసిన అవసరం ఉందని లంబాడీ జేఏసీ మంచిర్యాల జిల్లా గౌరవ అధ్యక్షులు తేజావత్ రాంబాబు నాయక్ పేర్కొన్నారు. 285 వ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా రామకృష్ణాపూర్ పట్టణంలోని కాకతీయ కాలనీలో భక్తిశ్రద్ధలతో భోగి బండారు కార్యక్రమం నిర్వహించి, శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జాతి ప్రజల కోసం చేసిన కృషిని జప్తికి తెచ్చుకొని, వారిని భక్తిశ్రద్ధలతో భోగ్ బండారో కార్యక్రమము నిర్వహించి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 400 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.భక్తి భావనతో పాటు, సామాజిక బాధ్యతగా జాతీ ప్రజల అభివృద్ధి కోసం, సమస్యల సాధన కోసం, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కోసం, ఐక్యమై ముందుకు సాగాలని భోగి బండారు నిర్వాహకులు తేజావత్ రాంబాబు నాయక్,తేజావత్ పాపా లాల్ నాయక్ పేర్కొన్నారు. మానవనియ విలువలతో ఆదర్శవంతమైన, మానవ విలువలతో విరసిల్లి సమాజ నిర్మాణం కోసం పాటుపడదామని శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆదర్శాలను తీసుకొని అన్ని కులాలకు మతాలకు, లంబాడి గిరిజన సమాజము ఆదర్శవంతమైన భావనతో ముందుకు సాగాలని వారు కోరారు.ఇట్టి కార్యక్రమంలో లంబాడి నాయకులు బానోతు రామారావు, యువకులు కుల్సోత్ సీతారాం నాయక్, తేజావత్ రామకృష్ణ నాయక్, తేజావత్ దామోదర్ నాయక్, వాంకుడోత్ రవి నాయక్, కున్సోత్ సతీష్, కుసోత్ సంతోష్, డాక్టర్ తేజావత్ రాధాకృష్ణ నాయక్, టి సరిత, కమలాబాయి, సరోజా, వనిత, తేజావత్ సాయి ప్రతీక్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.