
గ్రామపంచాయతీ స్పెషల్ అధికారి డి సునీత
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ ఫిబ్రవరి 15
గ్రామపంచాయతీ పారిశుద్ధ కార్మికులు చేస్తున్న సేవలు జీవితంలో మరిచిపోలేని అని గ్రామపంచాయతీ స్పెషల్ అధికారి డి సునీత అన్నారు గురువారం పారిశుద్ధ్య పనుల ముగింపు సందర్భంగా జిపి కార్మికులను ఆమె గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా శాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్యం గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేస్తూ గ్రామాన్ని సుందరీకరణ చేయడంలో వారి సేవలు అద్భుతం అన్నారు చెత్తాచెదారం లేకుండా చేసి దోమల ఎదుగుదల లేకుండా చేయడంలో వారి కృషి గొప్పదన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ నరేష్ జిపి కార్మికులు కారోబార్ అబ్బు గ్రామపంచాయతీ సిబ్బంది బండారి వేణు, బండారి రాధా, బండారి రాజయ్య ,ఉడత మొండయ్య, లింగయ్య అంగన్వాడి టీచర్లు ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు