
# ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు
నర్సంపేట,నేటిధాత్రి :
లంబాడా-గిరిజనుల ఆరాధ్య దైవమైన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ బంజారా జాతికి చేసిన సేవలు ఎనలెనివని బంజారా సాదు అజ్మీర యాకూబ్ మహారాజ్ అన్నారు.
285వ జయంతి వేడుకలు నర్సంపేట డివిజన్ నల్లబెల్లి మండలంలోని మేడపల్లి శివారు లక్ష్మితండా గ్రామంలో బంజారా సాదు అజ్మీర యాకూబ్ మహారాజ్ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ముందుగా బంజారా కులదైవాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం సాదు నెయ్యితో భోగ్ బండారో చేయగా వారి కుల దైవాలు ప్రత్యక్షం అయినట్లుగా భావిస్తూ జేజేలు పలికారు.అనంతరం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా బంజారా సాదు అజ్మీర యాకూబ్ మహారాజ్ మాట్లాడుతూ సద్గురు సేవాలాల్ మహారాజ్ బంజారా జాతికి చేసిన సేవలు ఎనలేనివని తెలిపారు. ప్రతీ తండాలో సేవాలాల్ జయంతి వేడుకలు విర్వహించలని సాదు యాకూబ్ మహారాజ్ గుర్తుకు చేశారు.
ఈ కార్యక్రమంలో తండా పెద్దమనిషి అజ్మీర బాసు నాయక్,మాజీ సర్పంచ్ తిరుపతి నాయక్, మాజీ ఎంపిటిసి పాండ్య భద్రు నాయక్, అజ్మీర చందర్ నాయక్,బానోతు మంజుల చందూలాల్ నాయక్,మాలోతు భీక్య నాయక్,మోహన్ నాయక్,భద్రు నాయక్,సర్దార్ నాయక్,సుధాకర్ నాయక్,బానోతు శ్రీనివాస్ నాయక్,భూక్యా సాయన్న నాయక్,బిచ్య నాయక్,అజ్మీర గణేష్ నాయక్,హర్జి నాయక్,సమ్మయ్య నాయక్,వీరన్న నాయక్,దర్మరావుపేట మాజీ ఉప సర్పంచ్ భూక్య కౌక రవి నాయక్,అజ్మీర సమ్మక్క తుల్చ్య నాయక్,అజ్మీర విజయ భాస్కర్ నాయక్ లతో పాటు వివిధ తండాల బంజారాలు పాల్గొన్నారు.