మరిపెడ నేటిధాత్రి :
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల పరిషత్ అభివృద్ధి నూతన అధికారిగా రేవతి బుదవారం బాధ్యతలు చేపట్టారు.ఇప్పటి వరకు ఎంపీడీవోగా భాద్యతలు నిర్వహించిన కే దన్సింగ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బదిలీ కాగా ఆయన స్థానంలో రేవతి చార్జి తీసుకోగా స్థానిక ఎంపీఓ పూర్ణచందర్ లతో పాటు సిబ్బంది స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ మండలంలో అన్ని గ్రామాల అభివృద్ధి కోసం తన వంతు బాధ్యతగా పనిచేస్తానని పేర్కొన్నారు.అలాగే మండలానికి సంబందించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.పలు రికార్డులను పరిశీలించారు.