గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
ఫిబ్రవరి 16 తారీకున గ్రామీణ భారత్ బంద్ జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం గుండాల మండలం శంబునిగుడేం గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎఐకెఎంఎస్ గుండాల మండల కార్యదర్శి బచ్చల సారయ్య పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ రైతాంగ వ్యతిరేక, కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి కార్మికులను,కర్షకులను అణచివేసి బడా పారిశ్రామిక వేత్తలకు దేశాన్ని అప్పగించడానికి చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా దేశ ప్రజలందరూ పోరాడాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతంలో ఈనెల 16న జరుగు బంద్ ను ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రైతాంగానికి పండించిన పంటకు గిట్టుబాటు మద్దతు ధర చట్టాన్ని చేయాలని నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులు, కర్షకులతో పెట్టుకుంటే తెలంగాణలో కేసీఆర్ కు పట్టిన గతే కేంద్రంలో నరేంద్ర మోడీకి పడుతుందని హెచ్చరించారు. రానున్న ఎన్నికలలో మోడీ ప్రభుత్వానికి ప్రజలు, రైతులు, కార్మికులు,నిరుద్యోగులు,ఏకతాటిపై నడుం బిగించి మోడీని గందే దించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కల్తీ మల్లయ్య, కోర్స బుచ్చయ్య, తప్పెట్ల రాములు,కుంజ రవీందర్,కల్తీ రమేష్,సర్వయ్యా, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కార్మిక, కర్షక గ్రామీణ బంద్ ను జయప్రదం చేయండి
