చందుర్తి, నేటిదాత్రి:
చందుర్తి, రుద్రంగి మండలాల పరిదిలోని ప్రభుత్వ, ప్రైవేట్, కె. జి.బి.వి ఉన్నత పాఠశాలల విద్యార్థుల అంతర్గత మార్కులు,నిర్మాణాత్మక మూల్యాంకనం,నమోదు చేసిన మార్కులు, సంబంధిత రికార్డులు, విద్యార్థులు నోట్ పుస్తకాలు తదితర అంశాలపై బుధవారం క్షుణ్ణంగా పరిశీలించి తగిన సూచనలు, సలహాలు తనిఖీ బృంద ప్రధానోపాద్యాయులు, మండల నోడల్ అధికారి వినయ్ కుమార్ అందించారు. పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు మరింత స్పష్టమైన అవగాహనతో చదివితేనే ఆశించిన స్థాయిలో విజయం సాధించడం,సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పరిశీలన బృంద ప్రధానోపాధ్యాయులు సునీత, సభ్యులు మేడికాల అంజయ్య, మహేశ్, మల్లారెడ్డి, కృష్ణ చైతన్య , కె.జి.బి.వి ఎస్.వో వనిత తదితరులు పాల్గొన్నారు.