అలరించిన సంగీత విభావరి.
కాజీపేట సిద్ధార్థ నగర్ కు చెందిన నాదసుధా తరంగిణి సంగీత శిక్షణాలయం విద్యార్థినీ, విద్యార్థులు సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి ఆరాధనోత్సవం మరియు వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఉదయం స్థానిక కమ్యూనిటీ హాల్ లో 12 గంటల పాటు నిర్వహించిన సంగీత విభావరి సంగీత ప్రియులను విశేషంగా అలరించింది.
ప్రముఖ సంగీత విద్వాంసులు కే.వీ. బ్రహ్మానందం ఆధ్వర్యంలో ఉదయం నగర సంకీర్తన సేవ నిర్వహించారు. ఆ తర్వాత శ్రీ త్యాగరాజ స్వామి వారి చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. పలువురు ప్రముఖ సంగీత కళాకారుల గాత్ర, వాయిద్య కచ్చేరీలు జరిగాయి. మధ్యాహ్నం నుండి సంగీత శిక్షణాలయం విద్యార్థిని విద్యార్థులచే నిర్వహించిన కచ్చేరీలు సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో నాద సుధా తరంగిణి సంగీత శిక్షణాలయం నిర్వాహకురాలు బి. విజయలక్ష్మి, బి శేషగిరి, పలువురు సంగీత కళాకారులు, సహకార వాయిద్య కళాకారులు, విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు, నగరంలోని సంగీత ప్రియులు పాల్గొన్నారు.