లక్షెట్టిపేట్ (మంచిర్యాల) నేటిధాత్రి:
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపెట్ మండలము తిమ్మాపూర్ గ్రామమునకు చెందిన నాంపల్లి రామక్క, W/o. రాజయ్య , కోట పోసమ్మ, W/o. నారాయణ అనే ఇద్దరు గుడుంబా అమ్మే వ్యక్తులను గతంలో తహసిల్దార్ లక్షెట్టిపేట ముందు నాటు సారాయి అమ్మకుండా బైండోవర్ చేయగా వారు తిరిగి మళ్లీ అదే నాటు సారాయిని అమ్ముతూ పట్టుబడగా కేసు నమోదు చేసి, బైండోవర్ ఉల్లంఘించినందున అతనికి తహాసిల్దార్ లక్షెట్టిపెట్ గారు ఉల్లంఘన నోటీసు జారీ చేసి జరిమానా చెల్లించవలసిందిగా తెలుపగా ఆ ఇద్దరు వ్యక్తులు జరిమానాను చెల్లించనందున గౌరవ తహసిల్దార్ లక్షెట్టిపెట్ శ్రీ బి. రాఘవేంద్ర రావు గారు బైండోవర్ కాలపరిమితి వరకు జైలు శిక్ష విధించగా రిమాండ్ నిమిత్తం అదిలాబాద్ జిల్లా జైలుకు నిన్నటి రోజు పంపినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్.బాబా తెలిపినారు
బైండోవర్ ఉల్లంఘన కేసులో జైలు శిక్ష
