వరంగల్/గీసుకొండ,నేటిధాత్రి :
వరంగల్ జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనవరి 28 న సుందరయ్యనగర్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో జరిగిన జిల్లాస్థాయి సాఫ్ట్ బాల్ జూనియర్స్ విభాగం ఎంపిక పోటీలలో 15 వ డివిజన్ గీసుగొండ మండలం గొర్రెకుంట ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. వారి క్రీడా ప్రతిభతో బి.శ్రీచరణ్,ఎల్.అక్షయ్, ఎల్.స్వదీప్ లు ఈనెల 10,11,12వ తేదీలలో ధర్మసాగర్ లో జరుగు రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్.జ్యోతిర్మయి తెలిపారు.రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను అందుకు ట్రైనీ ఇచ్చిన పిఈటి జె.రఘువీర్ లను
15వ డివిజన్ కార్పోరేటర్ ఎ.మనోహర్,పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్.జ్యోతిర్మయి,సాఫ్ట్ బాల్ జిల్లా బాధ్యులు పి.అశోక్ బాబు ,ముఖర్జీ పాఠశాల ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు పూర్వ విద్యార్థులు అభినందించారు.