
కుటుంబాన్ని ఆదుకున్నారు షేక్ గౌసుద్దీన్
బియ్యం నిత్యావసర వస్తువులు అందించిన మైనారిటీ నాయకులు
కారేపల్లి నేటి ధాత్రి
గేటు కారేపల్లి గ్రామానికి చెందిన షేక్ ఖాజా మొహీనుద్దీన్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఆర్థిక స్తోమత సరిగా లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో బిఆర్ఎస్ జిల్లా మైనార్టీ నాయకులు షేక్ గౌసుద్దీన్ వారికి నిత్యవసర వస్తువులు 50 కెజిల రైస్ ఇప్పించి ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో ఖలీలుల్లా ఖాన్ సద్దాం హుస్సేన్ అబ్దుల్ వహీద్ ఫిరోజ్ మున్వార్ పాషా పీలిక సారయ్య మోసిన్ ముస్తాక్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.