పరకాల నేటిధాత్రి
ప్రాహిచిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసులలో సీజ్ చేసినటువంటి (10) వాహనములకు గురువారం రోజున డిపి,ఈఓ ఆర్.లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో వాహనాల వేలం నిర్వహించడం జరిగింది.పది వాహనాలు అమ్ముడుపోగా దానికి ప్రభుత్వం నిర్ణయించిన ధర 46,500 ఉండగా వేలం ద్వారా 83,300 బిడ్ అమౌంట్,జిఎస్టీ ద్వారా 15000 రాగ మొత్తం 1,10,000 రూపాయలు సమాకురాయని గ్రోత్ 136 శాతం పెరిగిందని పరకాల ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె. జగన్నాథ రావు తెలిపారు.ఈ కార్యక్రమంలో పి,ఈఐ ఎన్.పద్మ,లక్ష్మణ చారి, సమ్మయ్య,రవీందర్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.