గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ గుండాల మండల కమిటీ ఆధ్వర్యంలో జవాజి సెంటర్ నందు ఆదివాసి తెగల సమ్మేళన కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుంపిడి వెంకటేశ్వర్లు పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఫిబ్రవరి 13 2024న మేడారం ప్రాంగణంలో ఆదివాసి సంస్కృతి సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు. రాజులకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆదివాసి మునగడ కోసం అనేక పోరాటాలు చేసి ప్రాణాలర్పించిన వారి త్యాగాలకు వారి పోరాటాలను కొని ఆడుతూ ఆదివాసులు అన్ని రాష్ట్రాలలో సంస్కృతి సంప్రదాయాలను ఆదివాసి పెద్దలను స్మరించుకుంటూ దేవతలుగా కొలుస్తున్నారని ఇందులో భాగంగా కాకతీయులతో పోరాడి రాజ్యాన్ని కాపాడుకొనుటకు ప్రాణాలర్పించిన సమ్మక్క సారమ్మను దేవతలుగా కొలుస్తూ ఆదివాసులు ఈ సమయాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ సమ్మేళనంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని గుండాల మండల కమిటీ పిలుపునిచారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పునెం శ్రీను, జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రయ్య,జిల్లా కార్యదర్శి మోకాళ్ళ కన్నయ్య, జిల్లా నాయకులు సాంబయ్య,జిల్లా సభ్యులు కిషన్ రావు, మండల అధ్యక్షులు గోవింద నర్సింగ్ రావు, ప్రధాన కార్యదర్శి చింత వెంకటేశ్వర్లు,మాడే సంతోష్,కల్తీ పాపయ్య, కిరణ్,కృష్ణ,రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.