తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మానేరు ఒడ్డున వెలసిన గంగ భవానిమాత ఉత్సవ విగ్రహాలకు తన వంతు సహాయంగా 50 వేల రూపాయల అందజేసిన మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మానేరు ఒడ్డున వెలిసిన గంగమ్మ తల్లి ఉత్సవ విగ్రహాలకు 50 వేల రూపాయలు అలాగే తాను జెడ్పిటిసి ఉన్న సమయంలో గంగమ్మ తల్లి దీవెనలతో బోర్లు వేశానని అవి విజయవంతం అయ్యాయని తల్లి మా ఇంటి దైవమని గంగమ్మ తల్లి దీవెనలతో గ్రామంలోని ప్రజలు అందరూ చల్లగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి సహాయానికి స్పందించిన గంగాభవాని సభ్యులు సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోడి అంతయును ఆశీర్వదించారు అలాగే గంగమ్మ ఆలయ అభివృద్ధి కోసం ఇంకా ఎవరైనా దాతలు ముందుకు రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు ఇట్టి కార్యక్రమంలో గంగపుత్ర సంఘం అధ్యక్షులు ఇటికల రాజనర్సు ప్రధాన కార్యదర్శి మల్లేశం కోశాధికారి దేవరాజు మాజీ అధ్యక్షులు ఇటుకల మహేందర్ సభ్యులు ఇటికల రాజేందర్ సింగ్ ఇటికల అశోక్ రమేష్ బాలకిషన్ శ్రీనివాస్ రవి శంకర్ చిన్న మహేందర్ తదితరులు పాల్గొన్నారు