నేటిధాత్రి కమలాపూర్ (హనుమకొండ)
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా గూడూరు గ్రామ తాజా మాజీ సర్పంచ్ అంకతి సాంబయ్య ను నియమించారు. రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బొడ్డు దేవయ్య ఈమెరకు ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా అంకతి సాంబయ్య మాట్లాడుతూ తనపై నమ్మకంతో మండల మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నియమించినందుకు బోడ్ల దేవయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.మాజీ సర్పంచుల సమస్యల సాధన కోసం కృషి చేస్తానని ప్రకటించారు.