రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిభిరం

భారత ప్రభుత్వం సహకారంతో వృద్ధులకు సేవాలందిస్తాం-డాక్టర్ విజయచెందర్ రెడ్డి

పరకాల నేటిధాత్రి
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రోజున ఆనంద ఆశ్రమ ఆవరణలో 60 సంవత్సరాలు పైబడిన వయోవృద్దలకు ఉచిత సంచార వాహన వైద్య సేవల ఆరోగ్య శిబిరం హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పి.విజయచందర్ రెడ్డి,వైస్ చైర్మన్ పెద్ది వెంకట నారాయణ గౌడ్,కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి ల ఆదేశానుసారం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ ఆరోగ్య శిబిరమును ఆనంద ఆశ్రయ మేనేజింగ్ ట్రస్ట్ ఈటల సమ్మయ్య ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటిస్,సీనియర్ సిటిజన్స్,భారత ప్రభుత్వ సహాకారంతో వయో వృద్ధులకు సేవలందించాలనే లక్ష్యంతో ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వృద్ధులకు బిపి,షుగర్,రక్త పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసారు.ఈ కార్యక్రమంలో హనుమకొండ రెడ్ క్రాస్ డాక్టర్లు జి.కిషన్ రావు,టి.మదన్ మోహన్ రావు,రెడ్ క్రాస్ సిబ్బంది గుల్లెపెల్లి శివకుమార్,అరువ గంగాధర్,సతీష్,నరసింహ చారి,పోశాలు,ఆనంద ఆశ్రయఅనుముల యాదగిరి, ప్రీతి మరియు వృద్దులు తదితరులు సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *