విఓ సంఘాల భవనాలు సత్వరమే మొదలుపెట్టుకోవాలి

గత అక్టోబర్ నెలలో మంజూరైన ముఖ్యమంత్రి ఎస్డిఎఫ్ నిధులు.
జీఓ నం.452 ద్వారా 102 భవనాలు రూ.18 కోట్ల 95 లక్షల నిధులు విడుదల
ఇచ్చిన మాట ప్రకారం నేను నిధులను సమకూర్చాను.
ఆ భవనాల శంకుస్థాపనలు మీరే చేసుకున్నారు.
మహిళా సంఘాలకు గుర్తుకు చేసిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి :

గత కేసీఆర్ ప్రభుత్వం గ్రామాల్లో మహిళా సమాఖ్య సంఘాలకు బలోపేతం చేసేందుకు సొంత భవనాల్లో ఉండేందుకు ముఖ్యమంత్రి స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్స్ ద్వారా 2023 అక్టోబర్ 4 న జీఓ నం.452 ద్వారా రూ.18 కోట్ల 95 లక్షల నిధులు విడుదల చేయించమని ఆ నిధులతో
వి.ఓ సంఘాల భవనాలు సత్వరమే మొదలుపెట్టుకోవాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మహిళా సంఘాల ప్రతినిధులకు సూచించారు.ఈ సందర్భంగా తన కార్యాలయం ద్వారా అందుకు సంబందించిన ముఖ్యమంత్రి ఎస్డిఎఫ్ గ్రాంట్ నుండి భవనాల నిర్మాణం కోసం మంజూరైన జీవో కాపీ, స్థానిక కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్ కాపీ ప్రతులను లేఖలో జతపరిచిన నర్సంపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామాల విఓ మహిళా సంఘాలకు పంపుతూ మాజీ ఎమ్మెల్యే పెద్ది మాట్లాడారు.నర్సంపేట నియోజకవర్గంలోని నూతనంగా 102 విఓ మహిళా భవనాల నిర్మాణం కొరకు ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృద్ధి నిధుల (ఎస్డిఎఫ్) నుండి నిధులను గత అక్టోబర్ 4 న మంజూరి ఇప్పించానని దానికి సంబంధించి ప్రొసీడింగ్ పత్రాన్ని స్థానిక జిల్లా కలెక్టర్ ఇవ్వడం జరిగిందన్నారు. ఆ నిధులను వెంటనే సద్వినియోగం పర్చుకోవాలని మహిళా సంఘాలను ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరారు.ఇప్పటికే నర్సంపేట నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీల్లో మహిళా భవనాల నిర్మాణాల కోసం ప్రభుత్వ స్థలాలను గుర్తించి, గ్రామ పంచాయతీల తీర్మాణాలు, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకొని గతంలోనే భూములను చూపించామని తెలిపారు.ఒక గ్రామంలో రెండు అంతకంటే ఎక్కువ విఓ సంఘాలు ఉన్నప్పటికీ ఒకే విఓ మహిళా భవన నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలాన్ని మీరిప్పటికే గుర్తించారని ,అందులో మీ
విఓ సంఘాల చేత ఈ పనులన్నింటికీ మీరే శంకుస్థాపనలు చేసుకున్న విషయాన్ని మాజీ ఎమ్మెల్యే పెద్ది ఈ సందర్భంగా మహిళా సంఘాల ప్రతినిధులకు గుర్తుకు చేశారు.
మీకు ఇచ్చిన మాట ప్రకారం నిధులను సమకూర్చాను అందుకు సంబంధించిన మంజూరు జీవో కాపీ, కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్ కాపీ ప్రతులను లేఖతో జతపరిచి ప్రతి వి ఓ మహిళా సంఘానికి పంపించినట్లు మహిళా సంఘాల ప్రతినిధులకు తెలిపారు. ఆ నిధులు వెనకకు పోకుండా (ల్యాప్స్) ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి భవనాల నిర్మాణ పనులన్నీ సత్వరమే పూర్తయ్యే విధంగా అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.అందుకు నా సహాయ సహకారాలు ఎప్పటికి ఉంటాయని మహిళా సంఘాల సభ్యులకు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!