
నేటి ధాత్రి కమలా పూర్ (హన్మకొండ)
కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం శ్రీ సమ్మక్క సారక్క జాతర 2024 ఉత్సవ కమిటీ నియామకం కోసం శనివారం రోజున గ్రామస్తులు సమావేశం ఏర్పాటు చేసుకొని చైర్మన్ గా చందబోయిన రాజు, ఉపాధ్యక్షుడిగా మోతె జగన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికైన అనంతరం హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ ను కలుసుకొని జాతర ఏర్పాట్ల కోసం వివరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చరణ్ పటేల్,
కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ నాయకులు రిక్కల నారాయణరెడ్డి
గట్టు శ్రీధర్,పుల్లూరి వెంకటేశ్వర్లు,సురేందర్,రాజు,రవి,లచ్చన్న,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.