
కార్మిక సంఘాల పిలుపు
వేములవాడ, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక కర్షక విధానాలకు వ్యతిరేకం గా ఈనెల 16, నాడు దేశవ్యాప్త సమ్మె, సడక్ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్మిక వర్గాలకు, రైతాంగం, శ్రామిక కూలీలకు, సామాన్య ప్రజానీకం, యువత మేధావులు, ఉద్యోగ సంఘాలు, పెద్ద ఎత్తున వేములవాడ డివిజన్ కేంద్రంగా చేసుకొని తిప్పాపురం బస్టాండ్ నుంచి, చెక్క పల్లి బస్టాండ్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిరసన కార్యక్రమం కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ఆ రోజు పెద్ద ఎత్తున ప్రజానీకం పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి అందరు పాల్గొనే విధంగా రావాలని ఈరోజు వేములవాడ సిఐటియు కార్యాలయంలో పత్రిక సమావేశం సందర్భంగా పిలుపు ఇవ్వడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, జిల్లా రైతు సంఘం కార్యదర్శి ముక్తి కాంత అశోక్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం అశోక్, సిఐటి అనుబంధం మధ్యాహ్న భోజన పథకం జిల్లా కార్యదర్శిగూరిజల శ్రీధర్, కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు చిలుక బాబు, వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షులు మామిళ్ళ పరశురాములు, తదితరులు పాల్గొన్నారు.