చర్ల మండలం.
తీన్మార్ మల్లన్న సోదరుడు వెంకటేశ్వర రావు
భద్రాచలం నేటి ధాత్రి
ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్ట భద్రుల ఎం ఎల్ సి స్దానానికి త్వరలో ఎన్నికలు జరగనున్నందున ఓటు నమోదును వేగవంతం చేయాలని తీన్మార్ మల్లన్న సోదరుడు చింతపండు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం చర్లలో విస్సా నాగభూషణం అద్యక్షతన జరిగిన మల్లన్న అభిమానుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టు భద్రుల ఓటు నమోదుకు ఈ నెల ఆరవ తేదీ చివరి రోజు కావడంతో ఆలోగా సాద్యమయినంత మంది పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించాలన్నారు. గతంలో జరిగిన పట్ట భద్రుల ఎన్నికలలో దాదాపు 40 వేల మంది పట్టభద్రులు గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకతతో బ్యాలెట్ పేపర్ పై తమ అభిప్రాయాలను వ్రాయడంతో అవి చెల్లకుండా పోయాయని గుర్తు చేసారు. ఆ ఓట్లన్ని మల్లన్నకు అనుకూలంగా పడినప్పటికీ చేతి రాతల కారణంగా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారన్నారు. ఈ సారి అలా జరగకుండా ఓటర్లకు అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేసారు. పట్టభద్రులు స్వఛ్చందంగా ఓటర్లుగా నమోదు చేయించుకొని జనం సమస్యలపై ప్రశ్నించే గొంతుకయిన మల్లన్నను భారీ మెజారిటీతో గెలిపించడంలో బాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం లో గుండేపూడి భాస్కర్ రావు, జవ్వాది మురళీకృష్ణ, గాలి గోపి, దరిగల హరిబాబు, తాండ్ర రాయుడు, బండి వేణు, పుప్పాల నర్సింహారావు, ఆవుల పుల్లారావు, మురళీదర్ నాయుడు, ఎడ్ల సత్తిబాబు, ఆవుల శివప్రసాద్, అలవాల మురళీ, వారాల వేణు, పూదోట సూరిబాబు పాల్గొన్నారు.
