కేసిఆర్‌ మౌనం మహా ప్రళయం.

https://epaper.netidhatri.com/

`కేసిఆర్‌ మౌనం రాజకీయ విస్పోటనం.

`అందులోనుంచి వచ్చిందే తెలంగాణ ఉద్యమం.

`ఉద్యమకాలంలోనూ అంతే…

`సిఎంగా వున్నప్పుడు అంతే..

`కేసిఆర్‌ మాట్లాడినా వార్తే…మాట్లాడకపోయినా వార్తే.

`రాజకీయ ప్రత్యర్థులంతా తలలు పట్టుకోవాల్సిందే.

`నిశ్శబ్దం భయంకరమైనది…కేసిఆర్‌ మౌనం సంచలనమైనది.

`ఆ మౌనం వ్యూహాత్మకం…

`కేసిఆర్‌ మాట్లాడితే అది గొప్ప సందేశం.

`రేపటి తెలంగాణ ప్రగతికి సంకేతం.

హైదరబాద్‌,నేటిధాత్రి:

భగవద్గీతలో శ్రీకృష్డుడు అంటాడు..ఈ విశ్వమంతా నా సృష్టే…నేనే విశ్వం…నేనే అనంతం…నేనే ప్రయళం..నేనే విలయం..నేనే విజయం..నేనే సర్వం.. ఎలా చూసుకున్నా కేసిఆర్‌ తెలంగాణ విషయంలో కూడా అదే నిజం..ఆయన ఉద్యమమే సంకేతం..కేసిఆర్‌ పోరాటమే తెలంగాణకు వరం..ఆనాడు శ్రీకృష్ణుడు ఎత్తిన అవతారమే నేడు తెలంగాణ కోసం కేసిఆర్‌ ఎత్తారు..అందుకే కేసిఆర్‌ మార్గం ఒక విజయం..కేసిఆర్‌ ఆలోచన ఒక ప్రపంచం.. కేసిఆర్‌ ఊహ తెలంగాణ సస్యశ్యామలం…కేసిఆర్‌ నవ్వు ఆకుపచ్చ తెలంగాణకు నిదర్శం..కేసిఆర్‌ పరుగు గోదావరి పరవళ్లు…కేసిఆర్‌ మాట గొప్ప భరోసా…అలాగే కేసిఆర్‌ మౌనం కూడా ప్రళయం. ప్రత్యర్ధి రాజకీయాలకు విలయం…ప్రత్యర్ధి శిబిరాలు కకావికలం..ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలోనైనా, నేడు తెలంగా ణలోనైనా కేసిఆర్‌ మాటే ఒక ఆయుధం… అసలు తెలంగాణ వస్తుందా? అన్న సంశయం తప్ప, నమ్మకం అన్న పదమే తెలంగాణ ప్రజల మదిలో కనిపించని ఆశయాన్ని నిజం చేసిన వీరుడు..ధీరుడు కేసిఆర్‌. ఒక ఉద్యమమంటే ఉత్త ముచ్చట కాదు..పార్టీ అంటే పాన్‌ డబ్బా పెట్టుకోవడం కాదు…తెలంగాణ కోసం కేసిఆర్‌ ఆలోచన చేసిన నాడు తెలంగాణ అంటే ఒక ఎడారి వ్యధ. కన్నీటికీ కూడా దిక్కులేని ధీనగాధ.
ఊరు చెదిరపోయి, పళ్లె కరిగిపోయి, కన్నీరు కూడా ఇంకిపోయి జీవశ్చవాలుగా జనం బతుకులీడ్చిన రోజలు.
ఆ మాటలు వింటుంటేనే కళ్లు చెమర్చుతాయి. కాని అనుభవించిన వారి గుండెలవిసిపోయాయి. ఒకనాడు తెలంగాణలో ఎన్నో ఆకలి చావులు. రైతు బతకలేదు. కుల వృత్తులకు మనుగడ లేదు. కూలీ చేసుకుందామంటే పని లేదు. కనీసం తిందామంటే పచ్చని ఆకు లేదు. ఎండిన మోడును చూసి రైతులు ఉరికొయ్యలు చేసుకొని అసువులు బాసిన రోజులు. అలాంటి సమయంలో జై తెలంగాణ అని గొంతు తాడారిపోతున్నా, నినదించిన నాయకుడు కేసిఆర్‌. తెలంగాణ కలను సజీవం చేసిన నాయకుడు కేసిఆర్‌. తెలంగాణ అనే పదానికి జీవం పోశాడు. ఆ నినాదానికి ఆయువు పోశాడు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి నింపాడు. తెలంగాణ జెండా ఎత్తి ప్రతి గుండె చేత జై కొట్టించాడు. పిడికిలెత్తి పటపట మంటూ తెలంగాణ మొత్తం పండ్లు కొరికేలాచేశాడు. లేకుంటే ఈ తెలంగాణ ఎక్కడిది…తెలంగాణ ఉద్యమమెక్కడిది..తెలంగాణ సాదన ఎక్కడిది..అసలు ఈ ఉనికెక్కడిది. నేడు ఈ స్వేచ్చా వాయువులెక్కడివి. పచ్చని తెలంగాణ మాగాణమెక్కడిది. తెలంగాణలో సాగే సాదన్నవారు చూసిన పంటలేమిటి? బంగారు సిరులను చూసిన వారికి మాటలు రాకుండా చేసిన పాలనెవరిది.
సాగునీటి ప్రాజెక్టులే సాధ్యం కాదన్న వారు సైతం సంబ్రమాశ్యర్యాలకు గురయ్యారు.
తొండలు గుడ్లు కూడ పెట్టవని హేళన చేసిన వారు ముక్కున వేళేసుకున్నారు. పదేళ్లలో మన కళ్లు మనం నమ్మలేకపోతున్నామని మధనపడుతున్నారు. కోట్లలో ధర పలుకుతున్న తెలంగాణ భూములను కొనాలంటే మా వల్ల ఏమౌతుందని భయపతున్నారు. పట్లకు పుట్ల పండుతున్న ధాన్యాన్ని చూసి కోనసీమను మించిన సాగు భూమి తెలంగాణ అయ్యిందని కితాబిస్తున్నారు. పదేళ్లలో తెలంగాణ వచ్చి మార్పును చూసి అబ్బురపడుతున్నారు. అరవైఏళ్లు తెలంగాణ ప్రజలు ఎంత మొత్తుకున్నా కాంగ్రెస్‌ నీళ్లివ్వలేదు. ఇప్పుడు కేసిఆర్‌ తెచ్చిన నీళ్లను కూడా మళ్లీ పొలలకు మళ్లించలేకపోతున్నారు. పాలన చేస్తామని చెప్పి, మళ్లీ పగ సాధించినంత పనిచేస్తున్నారు. మళ్లీ రైతులను కాపాడమని కేసిఆర్‌ను వేడుకుంటున్నారు. అందుకే అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒక్కటే..ఇప్పుడున్న పాలకులు నేర్చుకోవాల్సింది కూడా ఒక్కటే…
కేసిఆర్‌ లేకుంటే ఈ నీళ్లెక్కడివి. ఈ చల్లని గాలెక్కడిది.
పల్లెల్లో ఆ పచ్చదనమెక్కడిది. ఎండిన బీడుల్లో ఆ జలమెక్కడిరది. ఒట్టిపోయిన వాగుల్లో ఆ జలధారలెక్కడివి. ఎండా కాలంలో చెరువుల్లో నీళ్లెక్కడివి. వేసవిలో కూడా చెరువుల మత్తల్లేమిటి? తెలంగాణలో మత్య్స సంపదెక్కడిది. తెలంగాణలో ఎక్కడ చూసినా కేసిఆర్‌ కళ్లలో కనిపించే ఆశే…ఎక్కడ ఏ శబ్ధం విన్నా కేసిఆర్‌ శ్వాసే..అందుకే తెలంగాణ సాధన జరిగింది. పదేళ్లలో తెలంగాణ తలెత్తుకొని నిలబడిరది. వచ్చిన తెలంగాణ అన్న పూర్ణగా కీర్తినందుకున్నది. ఆహార పంటల సాగులో హరతులందుకుంటోంది. ప్రగతిలో పరుగులు పెట్టింది. అభివృద్ధి నమూనాకు ఆలవాలమైంది. దేశానికి ఆదర్శమైంది. పసిడి పంటల మాగాణమైంది. దేశానికే తెలంగాణ అన్నపూర్ణగా మారింది. ఒకనాడు మెతుకు కూడా దిక్కులేని మెదక్‌ జిల్లాలో నీటి ఊటలు జలజల మంటూ పారుతున్నాయి. ముళ్ల కంపలకు కూడా దిక్కులేని చోట బంగారు పంటలు పండుతున్నాయి. అలా తెలంగాణ అంతటా సిరులు సింగారం కనిపిస్తోంది. రైతన్న జీవితం బంగారమైంది.
సగటు తెలంగాణ వాది గుండెనడుగు..చెదిరిపోయిన చిగురించిన తెలంగాణ గూడునడుగు కేసిఆర్‌ అంటే ఏమిటో చెబుతుంది.
గుండె తడి ఆరని ఆత్మీయ తెలంగాణ సంతకం కేసిఆర్‌. ఎంత కాలమైనా చెరిగిపోని, చెరిపేయలేని ఏకైక సంతకం కేసిఆర్‌. మమకారానికి మాటలొస్తే చెప్పే ఏకైన పదం కేసిఆర్‌. మంచితనం తెలంగాణ మీద పంచే ఏకైక నామం కేసిఆర్‌. వేయిజన్మల తెలంగాణ పుణ్య ఫలం కేసిఆర్‌. కేసిఆర్‌ అంటేనే ప్రజలకు మేలు చేసే గొప్ప దృక్పథం. తెలంగాణ ప్రజల కన్నీళ్లు తుడిచే ఆశాకిరణం.అరవై సంవ త్సరాల తెలంగాణ గోసకు విముక్తి ప్రసాదించిన నాయక గణం..తెలంగాణ పాలిట వరం…..కేసిఆర్‌ మౌనం ఒక విస్పోటనం..అందులో నుంచి వచ్చిందే తెలంగాణ ఉద్యమం. ఉద్యమ కాలంలోనూ అంతే కొన్ని రోజులు మౌనం..మరి కొంత కాలం మాటలతో యుద్దం…సిఎంగా వున్నప్పుడూ అంతే..ఎందుకంటే కేసిఆర్‌ మాట్లాడినా వార్తే..మాట్లాకపోయినా న్యూసే…కేసిఆర్‌ ప్రతి అడుగుకు ప్రత్యర్ధులు తలలు పట్టుకోవాల్సిందే..నిశ్శబద్దం ఎంతో భయంకరమైనది. కేసిఆర్‌ మౌనం కూడా అంతే సంచలనమైంది.
ఆ మౌనం ప్రతి సారి వ్యూహాత్మకం.. కేసిఆర్‌ మాట్లాడితే అదే గొప్ప సందేశం.. రేపటి తెలంగాణ ప్రగతికి సంకేతం..
.అందుకే కేసిఆర్‌ అనే పదం తెలంగాణ కలల రూపమై దర్శిస్తుంది. తెలంగాణలో కేసిఆర్‌ ఆలోచనే సర్వాంతర్యామిలా కనిపిస్తుంది. కళ్లుతెరిచినా, కళ్లు మూసినా పద్నాలుగేళ్ల కేసిఆర్‌ పోరాటం ధ్వనిస్తుంది. పదేళ్ల అభివృద్ది మన కళ్లమందు ఆవిష్కారమౌతుంది. ప్రశాంతంగా వింటే గోదారి పరవళ్లు కేసిఆర్‌ను తలుకుంటూ పరుగులెత్తుతుంటాయి. పసిడి పంటల వెండి వెన్నెల తెలంగాణ మదిని తాకుతుంది. ఎంతో పులకించి పోతుంది. తెలంగాణ హృది నిండా ఆనందం నిండుతుంది. సంతోషం పరవశించి నాట్యమాడుతుంది. ఆనందతాండవమాడుతుంది. కేసిఆర్‌ పేరు వింటేనే తెలంగాణ ప్రకృతి పరవశించిపోతుంది. తెలంగాణ రమణీయత ఒళ్లు పులకరిస్తుంది. తెలంగాణకు రూపమిచ్చిన దైవం కేసిఆర్‌ రూపం కళ్లముందు కదలాడుతుంది. అందుకే మళ్లీ కేసిఆర్‌ కావాలని, రావాలని తెలంగాణ తపిస్తుంది. మళ్లీ మళ్లీ కేసిఆర్‌ నాయకత్వమే కావాలని కోరుకుంటోంది. తెలంగాణ కేసిఆర్‌ పాలన లేక కన్నీళ్లు పెట్టుకుంటోంది. తెలంగాణను కడుపులో పెట్టుకొని చూసుకున్న కేసిఆర్‌ను కాదన్నందుకు సమాజం పశ్చాత్తాపడుతోంది. కన్నీటి పర్యంతమౌతుంది. ఎండిన పొలాలు చూసుకుంటూ ఏడుస్తోంది. నిన్నటిదాకా పొలాల నిండా నీళ్లను కళ్ల చూసిన రైతు కంట కన్నీరు పొంగుతోంది. తెలంగాణలో మళ్లీ కేసిఆర్‌ పాలన ఏరువాకలా రావాలని కోరుకుంటోంది. కేసిఆర్‌ మౌనం ఎప్పుడు వీడుతాడా? అని ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ప్రజలకు కేసిఆర్‌ చల్లని మాటల కోసం తెలంగాణ ఎదురుచూస్తోంది. ఆ భరోసా ఎప్పుడు? ఆ మౌనం వీడెదెప్పుడు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!