
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రామచంద్రపురం గ్రామ సర్పంచ్ గా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి నేటి వరకు గ్రామఅభివృద్ధి లక్ష్యంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిస్వార్ధంగా సేవలు అందించిన చాడ ప్రసున చంద్రశేఖర్ రెడ్డికి గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ఆత్మీయ సన్మానసభలో శాలువా కప్పి, శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈకార్యక్రమంలో ప్రజలు మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో తారతమ్యాలు లేకుండా చూసుకుంటూ నిత్యం ప్రజాసేవలో ఉంటూ, అభివృద్ధి పథంలో గ్రామాన్ని నడిపించినారని ఈసందర్భంగా తెలిపారు. ఈకార్యక్రమంలో గ్రామప్రజలు, తదితరులు పాల్గొన్నారు.