
వరంగల్/గీసుగొండ,నేటిధాత్రి :
గీసుకొండ మండలం ఎలుకుర్తి (హవేలి) గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త మైదం ప్రేమనీల ఇటీవల మరణించగా శుక్రవారం కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, సామాజికవేత్త అల్లం బాల కిషోర్ రెడ్డి సహకారంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు మృతురాలి కుటుంబానికి 5 వేల రూపాయలను ఆర్ధిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో అల్లం మర్రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మలపల్లి శ్రీనివాస్,మాదాసి రాంబాబు,
జిల్లా నాయకులు సాయిలి ప్రభాకర్, కందికొండ రాజ్ కుమార్,తోట కమలాకర్, ఎలుకుర్తి గ్రామ పార్టీ అధ్యక్షులు నల్లా సురేష్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారంపెల్లి రమేష్, కాంగ్రెస్ శ్రేణులు రాజేశ్వర్ రావు,భాస్కర్,సంతోష్,తిరుపతి,రమేష్ తదితరులు పాల్గొన్నారు.