
ఎంసీపిఐ ( యు )జిల్లా కమిటీ సభ్యులు కొత్తకొండ రాజమౌళి
నర్సంపేట,నేటిధాత్రి :
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పోరేట్ శక్తులకు అనుకూలంగా ఉందని సామాన్య మధ్యతరగతి రైతు కార్మిక వర్గాలకు ఏమాత్రం ప్రయోజనం లేదని ఎంసీపి ఐ (యు ) జిల్లా కమిటీ సభ్యులు కొత్తకొండ రాజమౌళి అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు తీవ్ర నిరాశ కలిగించిందని,విద్యాసంస్థల్లో పోస్టుల భర్తీ అంశాన్ని అసలే ప్రస్తావించలేదన్నారు.ఆర్థిక మాంద్యం పేరుతో 35వేల కోట్ల బడ్జెట్ ను తగ్గించడంతో ప్రభుత్వ ఆర్థిక డొల్లతనం బయటపడింది అన్నారు . రైతు బంధు కొనసాగి స్తున్నామని చెప్పినప్పటికీ ఇప్పటివరకు తొలి విడత డబ్బులు రైతులకు అందలేదన్నారు . ఈ బడ్జెట్ పేద , మధ్యతరగతి ప్రజలకు నష్టం తప్ప ఏ మాత్రం లాభం లేదన్నారు . ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని , అంకెల గార డీ చేసిన బిజెపి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో దేశ ప్రజలంతా తగిన గుణపాఠం చెప్పాలన్నారు .ఈ సమావేశంలో ఎంసీపిఐ(యూ) చెన్నారావుపేట మండల కార్యదర్శి జన్ను రమేష్,ఏఐసిటియు కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎండి.మాషూక్ ,ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు