
వరంగల్, నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన ప్రముఖ అమ్మవారి దేవాలయం, వరంగల్లో ఉన్న శ్రీ భద్రకాళీ అమ్మవారి దేవస్థానంలో, నేటిధాత్రి పత్రిక వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కందికొండ గంగరాజు, 2024వ సంవత్సరం నేటిధాత్రి క్యాలెండర్ ను దేవాలయ గర్బగుడిలో పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో వరంగల్ జిల్లా ప్రెస్ క్లబ్ కమిటీ ఈసి మెంబర్ సీనియర్ జర్నలిస్ట్ కమటం వేణు గోపాల్ చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ నీలం శివ, పబ్లిక్ టీవీ రిపోర్టర్ కృష్ణ, నేటిధాత్రి మట్ట్వాడ రిపోర్టర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.