
కాప్రా నేటి దాత్రి ఫిబ్రవరి 02
కాప్రా మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ పరిధిలోని హెచ్ బీ కాలనీ ఫేజ్-1లో సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన స్ధానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్. అనంతరం ప్రభుదాస్ మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేసి కాలనీవాసులకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్ కి సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈ స్రవంతి, వర్క్ ఇన్స్పెక్టర్ చారి, నిసార్ అహ్మద్ గోరి తదితరులు పాల్గొన్నారు.