గ్రామపంచాయతీ పాలకవర్గానికి ఘనంగా పదవి విరమణ

ధర్మ రావు పేట అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పోతుల విజేందర్

గణపురం నేటి ధాత్రి గణపురం మండలంలోని ధర్మ రావు పేట గ్రామపంచాయతీ పదవి విరమణ చేపట్టిన సర్పంచి పోతుల ఆగమ్మ ఆధ్వర్యంలో వార్డ్ మెంబర్లకు ఘనంగా పదవీ విరమణ శాలువలతో కప్పి వారిని సన్మానించారు సర్పంచ్ తనయుడు ధర్మ రావు పేట గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పోతుల విజేందర్ మాట్లాడుతూ సర్పంచ్ ఆధ్వర్యంలో సిసి రోడ్లు పల్లె ప్రకృతి వాటర్ ప్లాంట్ వైకుంఠ దహనం అలాగే యువతకు ఆట వస్తువులు దుస్తులను పలు శంకుస్థాపనలు చేయడం జరిగింది ఐదు సంవత్సరాల కాలంలో మాకు వెన్నంటు ఉండి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట్ రమణారెడ్డి ఇచ్చినటువంటి పనులను విజయవంతంగా చేకూర్చున్నాము ధర్మారావు పేట పాలకవర్గానికి మాకు సహకరించినందుకు నా హృదయపూర్వక వందనములు అన్నారు వార్డ్ మెంబర్ ఆకుల సుభాష్ మాట్లాడుతూ ఈ గ్రామంలో చేసిన అభివృద్ధి పనులు తరతరాలుగా మర్చిపోమని అన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆకుల తిరుపతి వార్డ్ మెంబర్స్ మాడ లింగయ్య కొంపెల్లి శిరీష గండు శ్రీధర్ ఆకుల లక్ష్మి రాజయ్య ఆకుల సుభాష్ జాలిగాపు సుజాత కే శెట్టి రమాదేవి పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!