భూతగాదాల వల్లే హత్యచేసినట్టు వెల్లడించిన నేరస్తుడు
పరకాల నేటిధాత్రి
గురువారం రోజున పరకాల లోని ఏసిపి కార్యాలయంలో ఏసిపి కిషోర్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించి హత్యాకేసులో నేరస్తుడి వివరాలని వెల్లడించారు.కౌకొండ గ్రామానికి చెందిన మేకల సిద్దు తండ్రి కుమారస్వామి అనే వ్యక్తి భూ తగాదాల వల్ల వరుసకు బాబాయి అయిన అదే గ్రామానికి చెందిన మేకల, యుగేందర్(36) తండ్రి సారయ్య అనే వ్యక్తిని 30జనవరి తెల్లవారు జామున 1:20 నిముషాలకు కౌకొండ గ్రామ సెంటర్ లో గొడ్డలి తో నరికి చంపి తన వద్ద ఉన్న టూవీలర్ బండి పై పారిపోతూ గొడ్డలిని మరియు రక్తం మరకలు ఉన్న డ్రెస్ ను వెల్లంపల్లి కెనాల్ ఏరియా పొదల్లో దాచి పారిపోయాడు.గురువారం రోజున పరకాల రూరల్ సీఐ మల్లేష్,దామెర ఎస్సై కొంక అశోక్ లు కంటాత్మకూర్ సెంటర్లో వాహనాల తనిఖీ చేస్తుండగా నేరస్థుడు తను నేరానికి ఉపయోగించిన ఏపి 36 ఏటి 1532 నెంబర్ గల వాహనాన్ని నడుపుమా హన్మకొండ వైపు వెళ్తుండగా పట్టుబడ్డాడు.పంచుల సమక్షంలో నేరస్థుడిని పట్టుకొని వాహనాన్ని మరియు రక్తం మరకలు ఉన్న దుస్తులను గొడ్డలిని పోలీసులు సీజ్ చేశారు.నిందితుడిని కోర్టు లో హాజరుపరిచి,రిమాండ్ కు తరలించినట్లు ఏసిపి కిషోర్ కుమార్ తెలిపారు.