అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి

ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి
కుమ్మరి రాజ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజు డిమాండ్ చేసినారు అదేవిధంగా ప్రైవేట్ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు కనీసం మౌలిక సదుపాయాలు లేకుండా విద్యార్హత లేని టీచర్లను పెట్టి నడిపిస్తున్నటువంటి ప్రైవేట్ జూనియర్ కళాశాల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా కాలేజీలో చదువుతున్న విద్యార్థుల దగ్గర వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తుంటే సంబంధించిన అధికారులు పట్టించుకోక పోవడం వల్ల విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రైవేట్ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల దగ్గర కాలేజీ ఫీజు అంటూ రికార్డ్ ఫీజు అంటూ ప్రాక్టికల్ ఫీజు అంటూ తమ ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ జూనియర్ కళాశాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పిస్తామంటూ చెబుతూ విద్యార్థుల దగ్గర వేలకు వేలు పేజీలు బస్సు చేస్తున్న తరుణం ఏర్పడింది ఇది ఇలా ఉండంగా ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ దగ్గరలో ఉండగా చదువుకునే విద్యార్థుల దగ్గర్నుంచి మీ హాజరు పర్సంటేజ్ లేదు అనే కారణంతో ఆ కారణంతో కూడా విద్యార్థుల దగ్గర వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నారు అదేవిధంగా ప్రైవేట్ జూనియర్ కళాశాలలో పూర్తిస్థాయిలో ఫ్యాకల్టీ ఉండడం లేదు క్లాస్ రూమ్స్ లేవు విద్యార్థులకు కనీసం మౌలిక సదుపాయాలు లేవు. బాత్రూమ్స్ లాట్రూమ్స్ అందుబాటులో లేవు. కనీసం కాలేజీలో చదువుకునే విద్యార్థులకు తాగడానికి వాటర్ కూడా లేవు ఇవి ఇలా ఉండగా విద్యార్థులు ఫీజులు కట్టాలని చెప్పి వేధించడం జరుగుతుంది. అదేవిధంగా పలుమార్లు చెప్పిన గాని పట్టించుకోని పరిస్థితి ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నడిపిస్తున్న ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ యజమాన్యం తీరు కనిపిస్తా ఉంది అదేవిధంగా ఆ కాలేజీలో చదువుతున్న విద్యార్థుల దగ్గర్నుంచి వేలకు విధులు ఫీజులు వసూలు చేస్తున్నారు అందులో చదువుకునే విద్యార్థులు అందరూ పేదవాళ్లు వాళ్ళు వసూలు చేసే ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్న విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి కనబడుతుంది రాబోయే రోజుల్లో ఇది అధిక సంఖ్యలో పేరుకుపోయి విద్యార్థుల ప్రాణానికి ప్రాణనాష్టం అయ్యేలా కనిపిస్తా ఉంది వెంటనే దీనికి సంబంధించిన అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరిగింది. లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *