నేను బి ఎం స్ కార్యకర్తగానే కొనసాగుతాను కదాసి భేమయ్య
తేదీ:-31/01/2024 బుధవారం నాడు నాపై వచ్చినటువంటి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ -BMS యూనియన్ నుండి తొలగిస్తూ వచ్చినటువంటి వార్తలను తీవ్రంగా పరిగణిస్తూ, నాపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. గత 5 సంవత్సరాలుగా యూనియన్ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటూ, కార్మిక సమస్యల పట్ల స్పందిస్తూ యూనియన్ కు పని చేయడం జరిగింది. కానీ సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్-BMS యూనియన్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య నాపై చేసిన ఆరోపణలు, నేను సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాలు పడుతున్నానని, దురుసుగా ప్రవర్తిస్తున్నానని, సంబంధం లేని అభయోగాలను నాపై మోపడాన్ని ఖండిస్తూ, యాదగిరి సత్తయ్యకు బహిరంగ చర్చకు సవాల్ విసిరుతున్నాను, యాదగిరి సత్తయ్య చరిత్ర గోదావరిఖని లక్ష్మీ నగర్ పత్రికా మిత్రుల సమక్షంలో బహిరంగ చర్చకు నేను సిద్ధము. సెంట్రల్ కమిటీలో తిరస్కరించిన నిన్ను ఇంకా యూనియన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నావు. అసలు నువ్వు సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ -BMS యూనియన్ అధ్యక్షుడివే కాదు. మొన్న జరిగిన యూనియన్ ఎన్నికల్లో సింగరేణి కార్మికులుఇప్పటికే బుద్ధి చెప్పారు. నన్ను BMS యూనియన్ నుండి తొలగించే అర్హత నీకు లేదు, నేను BMS కార్యకర్తగానె కొనసాగుతా. భవిష్యత్తులో కార్మికులు తగిన గుణపాఠం చెపుతారు.