జైపూర్ మండల కేంద్రంలో పలు ప్రారంభోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే

జైపూర్, నేటి ధాత్రి

జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో సింగరేణి సంస్థ 62 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన శ్రీరాంపూర్ ఏరియా జిఎం సంజీవరెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తర్వాత వేలాల గ్రామంలో నూతనంగా నిర్మించిన పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు . గంగిపెల్లి గ్రామంలో నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్ భవనాన్ని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ చేతుల మీదుగా ప్రారంభించారు . మిట్టపల్లి గ్రామంలో మహిళా భవన్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే వివేక్ ప్రారంభించారు.


ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి మాజీ శాసనసభ్యులు నల్లాల ఓదెలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు .
ఈ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వేలాల గ్రామపంచాయతీ నందు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని వేలాల గ్రామపంచాయతీలో కొలువైన మల్లన్న దేవుడు ప్రత్యేకమైన మహిమ కలిగిన కారణంగా గుడికి భక్తులు దూరప్రాంతాల నుండి అధిక సంఖ్యలో తరలివస్తారని పేర్కొన్నారు.గుట్టపైన గుడి అటవీ ప్రాంతం లో ఉండడం వలన ఒక 700 మీటర్లు రోడ్డు వేయాలంటే అటవీశాఖ అధికారుల నుండి అనుమతి తీసుకోవలసి ఉంటుందని తెలియజేశారు .జాతర సమీపిస్తున్న సందర్భంగా గ్రామంలోని నాయకులు గుడి దగ్గర కొన్ని సదుపాయాలు చేయవలసిందిగా కోరినారని తెలిపారు .జిల్లాలోనే ప్రత్యేకమైన పేరు పొందిన గుడి కాబట్టి అటవీ శాఖ అధికారులతో చర్చించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని వెల్లడించారు.ఎంతో విశిష్టత కలిగిన ప్రజల ఇష్టదైవం వద్దకు మొక్కుబడులు తీర్చడానికి దూర ప్రాంతాల నుండి వచ్చిన వారందరికీ ప్రత్యేక సదుపాయాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు,నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!