జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :
జమ్మికుంట హోసింగ్ బోర్డు కాలనీకి చెందిన తూడి రవిచందర్ రెడ్డి అనే వ్యక్తి కొంత ప్రభుత్వ భూమిని ఆక్రమణ చేసుకొని. సదరు స్థలంలో ప్రహారి గోడ నిర్మాణం చేపట్టాడని చెప్పి అదే కాలనికి చెందిన లింగంపల్లి శ్రీనివాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. మున్సిపల్ సిబ్బంది బుధవారం సంఘటన స్థలానికి చేరుకోని క్షేత్రస్థాయిలో విచారణ జరిపి. సదరు స్థలాన్ని జెసిబి సహయంతో కూల్చి వేశారు. ఇది ప్రభుత్వ భూమని. దింట్లో ఎవరు చోరబడ్డ చర్యలు తప్పమని నోటిన్ బోర్డును అట్టి స్థలంలో ఏర్పాటు చేశారు. అదే కాకుండా రహదారిని ఆక్రమించుకోని నిర్మాణం చేపట్టిన ఫిర్యాదు పై సైతం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకొననున్నట్లు టౌన్ ప్లానింగ్ అధికారి అనాల్దాస్ శ్రీధర్ తెలిపారు. పట్టణంలో ఎలాంటి ఆక్రమ నిర్మాణాలు జరిగినట్లు ఫిర్యాదులు అందితే తక్షణమే స్పందించి సదరు ఆక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు సైతం మున్సిపల్ అధికారులు వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా ఆయన పేర్కోన్నారు.