# ప్రకటన విడుదల చేసిన
ప్రిసిడింగ్ అధికారి,ఆర్డీవో కృష్ణవేణి
నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట మున్సిపల్ చైర్మన్ గుంటి రజినీ కిషన్ పై కౌన్సిలర్స్ పెట్టిన అవిశ్వాస తీర్మానం రద్దు చేస్తున్నట్లు
ప్రిసిడింగ్ అధికారి,రెవెన్యూ డివిజనల్ అధికారిని కృష్ణవేణి తెలిపారు.నర్సంపేట మున్సిపాలిటీలో మొత్తం 24 మంది కౌన్సిలర్స్ ఉన్నారు.అందులో 6 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కాగా 18 మంది బిఅర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్స్ ఉన్నారు.కాగా చైర్ పర్సన్ గుంటి అదే పార్టీకి చెందిన కౌన్సిలర్స్ ఈ నెల 2 జిల్లా కలెక్టర్ కు అవిశ్వాసం పెడుతున్నట్లు తీర్మానం అందించారు.ప్రభుత్వ పద్దతులతో మంగళవారం అవిశ్వాసం పట్ల మున్సిపల్ కార్యాలయంలో ప్రిసిడింగ్ అధికారి,ఆర్డీవో కృష్ణవేణి సంబంధిత కమిషనర్ నాయిని వెంకటస్వామితో కలిసి ప్రారంభం చేశారు.ఉదయం 11 గంటల నుండి11.30 వరకు అవిశ్వాసం పట్ల ఎవరూ హాజరు కాకపోవడంతో అధికారిని అవిశ్వాసానికి మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.ఆ సమయంలో కూడా బిఅర్ఎస్,కాంగ్రెస్ పార్టీలకు చెందిన కౌన్సిలర్స్ హాజరు కాకపోవడంతో జి.ఓ.ఎం.ఎస్. నెం. 835, రూల్ 10(3) మేరకు రద్దు చేస్తున్నట్లు ప్రిసిడింగ్ అధికారి,రెవెన్యూ డివిజనల్ అధికారిని కృష్ణవేణి ప్రకటించారు.