ఎంపీ వద్దిరాజుకు ఆహ్వానం

Date 30/01/2024
—————————————
వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి భూలక్మీ శ్రీలక్ష్మీ బొడ్రాయి పునఃప్రతిష్ఠ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావలసిందిగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను ఆ గ్రామ పెద్దలు ఆహ్వానించారు.హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఎంపీ రవిచంద్ర క్యాంపు ఆఫీసులో ప్రముఖ వ్యాపారవేత్త కూసం శ్రీనివాసులు ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఆయన్ను కలిసి వచ్చే నెల 12నుంచి 14వతేదీ వరకు జరిగే ఈ మహోత్సవాలకు హాజరు కావలసిందిగా కోరారు.ఎంపీ రవిచంద్రను కలిసిన వారిలో కరీమాబాద్ గ్రామ పెద్దలు నాగపురి సంజయ్,నొగిళిశెట్టి అనిల్,వంగరి కోటేశ్వర్,వేండిది మధు,వీ.యుగంధర్,ఎన్.అశోక్ తదితరులు ఉన్నారు, వారి ఆహ్వానం పట్ల ఎంపీ వద్దిరాజు సానుకూలంగా స్పందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!