
డిసిసి ప్రధాన కార్యదర్శి గొట్టే ప్రభాకర్.
చందుర్తి, నేటిధాత్రి:
జనవరి 30 మంగళవారం గాంధీ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు….
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాధారణ వ్యక్తి అయిన మహాత్మా గాంధీ దేశ ప్రజలందరినీ ఏకం చేసి బ్రిటిష్ వారి కబంధహస్తాల నుండి దేశాన్ని విడిపించిన మహనీయుడని అన్నారు.. గాంధీ వర్ధంతి రోజును అమరవీరుల సంస్మరణ దినంగా జరుపుకుంటున్నామని , ఇందులో భాగంగా దేశ యువత గాంధీ అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు…
ఈ కార్యక్రమంలో చందుర్తి గ్రామ అధ్యక్షులు, దారం చంద్రం, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పులి సత్యం,, దెబ్బడి కిషన్, లింగంపల్లి అజయ్, లింగంపల్లి శ్రీనివాస్, జువారి సాగర్ రావు తదితరులు పాల్గొన్నారు.