
నడికూడ,నేటి ధాత్రి:
మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం నందు మహాత్మా గాంధీ 76 వ వర్ధంతి సందర్భంగా నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్ జాతిపిత మహాత్మ గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరo మాట్లాడుతూ అహింసనే ఆయుధంగా మలుచుకుని ఏదైనా సాధించవచ్చునని నిరూపించిన గొప్ప మహానీయులు గాంధీజీ, స్వరాజ్య సాధనకు అహింస అనే ఆయుధాన్ని వాడి ప్రపంచానికి దాని ప్రాధాన్యతను తెలిసేలా చేసిన ధీశాలి మహాత్మా గాంధీ అని తెలిపారు.ఈ కార్యక్రమంలో నడికూడ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కుడ్ల మలహాల్ రావు,పర్నెం మల్లారెడ్డి,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాళ్ల నవీన్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అప్పం కుమారస్వామి,రాష్ట్ర మాల మహానాడు అధికార ప్రతినిధి నీరాటి రాములు,కాంగ్రెస్ నాయకులు దుప్పటి మల్లేష్, అనిల్,విజేందర్,సుధయ్య,దుప్పటి అన్నయ్య,కిస్టఫర్ తదితరులు పాల్గొన్నారు.