
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వ్యాసరచన ,స్పెల్వ్విజార్డు టాలెంట్ టెస్ట్, గేమ్స్ ఇలా వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులను ఎంఈఓ కోడెపాక రఘుపతి అభినందించారు. నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటిలో డెమోక్రసీ అండ్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనే అంశంలో ఎస్.సంజయ్ మండల స్థాయిలో ఎంపికై జిల్లా అడిషనల్ కలెక్టర్ చే బహుమతి పొందారు.మోడల్ స్కూల్ చిట్యాలలో నిర్వహించిన మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ లో జడ్పీహెచ్ఎస్ చిట్యాల విద్యార్థులు ఎస్.సంజయ్ 10వ, ఎస్. హర్ష 9వ, ఎస్. సునీల్ 8వ లు ప్రథమ స్థానం పొంది జిల్లా స్థాయికి ఎంపికయ్యారు.ఇంగ్లీష్ టాలెంట్ టెస్ట్ స్పెల్ విజర్డ్ లో మండల స్థాయి లో సైతం జడ్పిహెచ్ఎస్ చిట్యాల విద్యార్థి అయిన ఓ. చిరంజీవి 9వ ప్రథమ స్థానం పొంది జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఇలా చదువులోనే కాక ఆటల్లో సైతం ప్రతిభ కనబరిచారు.కబడ్డీలో తయ్యుబ్, శశివర్ధన్లు కోకోలో శశికిరణ్ ,బాలికల విభాగంలో వైశాలి ,స్వరూప వాలీబాల్ లో ఎం. సాయి చరణ్ లు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఇలా చదువులో మరియు ఆటల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంఈఓ శ్రీ కోడెపాక రఘుపతి గారు అభినందిస్తూ బాల్యదశలో కష్టపడితే నే భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని వీరిని మిగతా విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీరాం రఘుపతి, రాజమౌళి, శంకర్, రామ్ నారాయణ, సదయ్య ,ఉస్మానలి, సరళ ,నీలిమ, విజయలక్ష్మి, కల్పన, సుజాత, పీఈటి భాస్కర్, బుజ్జమ్మ, రాజు తదితరులు పాల్గొన్నారు.