
ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బొట్ల నరేష్ డిమాండ్
హన్మకొండ, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా చింతకుంట సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మృతి పట్ల నిర్లక్ష్యం వివరించిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ సంబంధిత జిల్లా (ఆర్ సి ఓ) కోఆర్డినేటర్ పై చర్యలు ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ ట్విట్టర్ వాట్సప్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి కి మరియు బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి ఫిర్యాదు చేశారు.
అనంతరం బోట్ల నరేష్ మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో ప్రతి నెలకొకసారి సంబంధించిన జిల్లా ఆర్సిఓ గారు అదేవిధంగా సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా నవీన్ నికోలస్ గార్లు పర్యవేక్షణ చేసి విద్యార్థులకు ప్రభుత్వం అందజేసే పాఠ్యపుస్తకాలు నోట్ బుక్స్ మేకప్ కిట్ సోప్ మనీ నాణ్యత మైన భోజనం ఏ విధంగా ఉంటుందో చూడవలసిన అధికారులు కేవలం కుర్చీలకే పరిమితం అవడం వలన విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నారు కావున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి విద్యార్థి మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకొని మరియు విద్యార్థి కుటుంబానికి 10 లక్షల ఎక్స్రే చెల్లించాలని అది విధంగా సాంఘిక సంక్షేమ గురుకులాల పాఠశాల కళాశాల చదువుతున్న విద్యార్థుల అందరికీ న్యాయం చేయవలసిందిగా ఐక్య విద్యార్థి సంఘాల నుండి కోరడం జరుగుతుందన్నారు.