
ఘనంగా76వ వర్ధంతి వేడుకలు
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్దగల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించడం జరిగినది ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు మహాత్మాగాంధీ 76వ వర్ధంతిని పురస్కరించుకొని సత్యం అహింసలనే ఆయుధాలుగా మలుచుకొని యావత్ భారతావనికి స్వేచ్ఛ స్వాతంత్రాలను ప్రసాదించిన గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ అంటరానితనం కుల నిర్మూలన పేదరిక నిర్మూలన కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి గ్రామీణ ప్రాంతాలలో పల్లెలు అభివృద్ధి చెందినప్పుడే యావత్ దేశం ప్రగతి పథంలో పయనిస్తుందని నమ్మి గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేసిన మహనీయుడు గాంధీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు వైనాల కుమారస్వామి దుబాసి కృష్ణమూర్తి రఫీ నిమ్మల రమేష్ ఎండి హైదర్ కుక్కల బిక్షపతి రవిపాల్ రాజు మార్కండేయ చిరంజీవి సదానందం తదితరులు పాల్గొన్నారు.