
వీణవంక, (కరీంనగర్ జిల్లా),
నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని కొండపాక గ్రామంలో ప్రజలకు ఉత్తమ సేవలందిస్తున్న
కేంద్రాలను జాతీయ వైద్య బృందం గుర్తించి కొండపాక పల్లె దావకానకు నేషనల్ క్వాలిటీ అన్యూరెన్స్ స్టాండర్స్ గుర్తింపు లభించింది కొండపాక పల్లె దావకాన గుర్తింపు రావడం చాలా అభినందనీయంగా ఉన్నదని జిల్లా వైద్యాధికారి లలితా దేవి అన్నారు.
గత నెలలో కరీంనగర్ జిల్లాలో జాతీయ వైద్య బృందం సభ్యులు వీణవంక మండలంలోని కొండపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పల్లె దవాఖానలో ప్రజలకు అందిస్తున్న ఉత్తమ సేవలు వసతులు జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాలకు అమలు చేస్తున్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వారి పరిశీలనలో కొండపాక పల్లె దవాకన ప్రమాణాలను పాటించడంతో జాతీయ స్థాయి గుర్తింపు వచ్చినది. డీ ఎం హెచ్.ఓ చందు డిప్యూటీ డి హెచ్ తులసి రవీందర్ ఎన్ హెచ్ ఎం డి పి ఓ రమణ పి హెచ్ సి డాక్టర్ వివేకానంద రెడ్డి క్వాలిటీ మేనేజర్ సాగర్ టీ బి మలేరియా లేప్రాసి సూపర్వైజర్స్ సర్పంచ్ ఆవాల అరుంధతి గిరిబాబు, ఉపసర్ప రామగుండం రాజకుమార్, పంచాయతీ సెక్రెటరీ శ్రీకాంత్, ఏఎన్ఎమ్స్ రాజమణి, రాజేశ్వరి, ఆశ వర్కర్స్, అంగన్వాడీ టీచర్స్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.