
ఘనంగా 76వ వర్ధంతి వేడుకలు..
నర్సంపేట,నేటిధాత్రి :
జాతిపిత మహాత్మునికి మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమర యోధుడు స్వర్గీయ మహాత్మా గాంధీ 76వ వర్ధంతిని పురస్కరించుకొని నర్సంపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని రాజేందర్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్,నియోజకవర్గ కన్వీనర్ తక్కళ్లపెల్లి రవీందర్ రావు,మాజీ మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ లు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో హింసకు ఏమాత్రం తావివ్వకుండా అహింస మార్గం ద్వారా స్వాతంత్ర్యం తీసుకురావడంలో విజయం సాధించిన మహానీయుడని గాంధీజీ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నూనె పద్మ, పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మాదాసి రవికుమార్, ఓబిసి జిల్లా ఉపాధ్యక్షులు మెరుగు సాంబయ్య, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తుమ్మలపెల్లి సందీప్, పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు జూలపెల్లి రాజేశ్వర్ రావు, దూడేలా సాంబయ్య, వేముల సారంగం గౌడ్, ఓబిసి పట్టణ ఉపాధ్యక్షులు ఓర్సు సాంబయ్య, మాజీ వార్డ్ మెంబర్లు గాజుల రమేష్, పేరం బాబురావు, 16వ వార్డు అధ్యక్షులు బాణాల శ్రీనివాస్-ప్రసన్న, కీసరి వెంకటేశ్వర్లు, గోపు మహేందర్ రెడ్డి, కొప్పు అశోక్, ఎస్ కే, ఖాజాబీ, గద్ద జ్యోతి, దేశి లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.