
-జిల్లా జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి
కొనరావుపేట, నేటి దాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం 14వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రజా పరిషత్ జెడ్పి చైర్మన్ ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ కార్యదర్శులు ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులు సక్రమంగా చేయాలని అన్నారు. అదేవిధంగా మేట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు కొలతలు సరిగ్గా నమోదు చేయాలన్నారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా మస్టర్లలలో కూలీల సంతకాలు తీసుకోవాలన్నారు. ఒకరికి బదులుగా మరొకరు రాకుండా జాబ్ కార్డు ఉన్న వారే పనులకు హాజరక వాలని సూచించారు. కూలీలు కూడా పని సమయాన్ని కనీసం 5 – 6 గంటలకు పని చేయాలన్నారు. మనం చేపట్టిన పనులు నాణ్యతగా ఉండాలని అన్నారు. పనులను జాగ్రత్తగా చేపిస్తే, తనిఖీ లో ఎలాంటి ఇబ్బందులు రావన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఆర్డిఓ మదన్ మోహన్, ఎంపిడిఒ రామ కృష్ణ, స్టేట్ రిసోర్స్ పర్సన్స్, సర్పంచులు పోకల రేఖ సంతోష్, కోక్కుల భారత నర్సయ్య, అనుపాటి భారతి బాపురెడ్డి, రాములు నాయక్, ఎంపిటిసి నరసింహ చారి, కార్యదర్శులు, తదితరులు ఉన్నారు.