జీహెచ్ఎంసీ కమిషనర్ను కోరిన నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి
ఉప్పల్ నేటి ధాత్రి జనవరి 27
ఉప్పల్ నియోజకవర్గంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులకు నిధులను కేటాయించాలని నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి కోరారు.
శనివారం జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రాస్ ను పరమేశ్వర్ రెడ్డి కలిశారు.
నియోజకవర్గంలో ఉన్న సమస్యలు, వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన పనులు, కేటాయించాల్సిన నిధుల గురించి చర్చించారు.
నియోజకవర్గంలోని కాలనీలు, మురికివాడలలో సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు, స్మశాన వాటికలు, పార్కుల అభివృద్ధి, చెరువులు సుందరీకరణ, పరిరక్షణ, నాలాల అభివృద్ధి, పరిరక్షణకు తదితర సమస్యలు, నిధుల కేటాయింపు గురించి కమిషనర్ దృష్టికి పరమేశ్వర్ రెడ్డి తీసుకెళ్లడం జరిగింది.
ఈ పనులకు కావాల్సిన నిధులను కేటాయించి పనులను చేపట్టాలని కోరారు. ఇప్పటికే పెండింగ్ ఉన్న పలు అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేసేలా చూడాలన్నారు. పరమేశ్వర్ రెడ్డి అడిగిన అంశాలపై కమిషనర్ సానుకూలంగా స్పందించారు.