మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ జనవరి 26
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్ళ పల్లి మండలంలోని గణతంత్ర దినోత్సవ వేడుకలు వివిధ శాఖల ఆఫీసులలో,తాసిల్దార్ ఆఫీస్ , తాసిల్దార్ సునీత , మండల పరిషత్ ఆఫీసులో ఎంపీడీవో కృష్ణవేణి మొగుళ్ళపల్లి గ్రామ పంచాయితీ ఆవరణంలో గ్రామ సర్పంచ్ ధర్మారావు జెండా ఆవిష్కరణ చేశారు ,అనంతరం స్వీట్స్ పండ్లు పంచడం జరిగింది ఈ గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని తాసిల్దార్ సునీత మాట్లాడుతూ భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారు 26 జనవరి 1950లో భారత ప్రభుత్వ చట్టానికి 1935 బదులు భారత రాజ్యాంగం దేశ పరిపాలనకు మార్చడాన్ని భారత గణతంత్ర దినోత్సవం అంటారు అని ఆమె అన్నారు ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీపీ యారా సుజాత సంజీవరెడ్డి, ఎంపీటీసీలు, వివిధ గ్రామాల సర్పంచులు, మండలంలోని వివిధ శాఖల అధికారులు , గ్రామ వార్డు మెంబర్స్ వివిధ గ్రామాల రేషన్ డీలర్స్ రాజకీయ నాయకులు గ్రామ ప్రజలు , గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు