
నర్సంపేట /దుగ్గొండి,నేటిధాత్రి :
దుగ్గొండి మండల పరిషత్ పరిధిలో ఉత్తమ సేవలను అందించిన అధికారులను గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఉత్తమ అధికారులుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగా దుగ్గొండి మండలానికి చెందిన ఇద్దరులో మండల పంచాయితీ సూపరింటెండెంట్,పంచాయతీ కార్యదర్శి ఉత్తమ అధికారులుగా ఎంపికయ్యారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సూపరింటెండెంట్ గా
విధులు నిర్వహిస్తున్న రవి కుమార్,చాపలబండ గ్రామ పంచాయితీ కార్యదర్శి మాడిషెట్టి స్రవంతిలు ఉత్తమ అధికారులుగా ఎంపికయ్యారు.కార్యదర్శి మాడిషెట్టి స్రవంతి గ్రామ పంచాయితీ పరిధిలో పారిశుధ్య నిర్మూలన,పంచాయితీ అభివృద్ధి పట్ల కృషి చేసినందుకు గాను జిల్లా స్థాయి అధికారులు గుర్తించి ఆమెకు ఉత్తమ గ్రామ కార్యదర్శిగా ఎంపిక చేయడం పట్ల ఎంపిపి కోమల భద్రయ్య,ఎంపీడీవో కృష్ణ ప్రసాద్,ఎంపీఓ శ్రీదర్ గౌడ్,చాపలబండ సర్పంచ్ రజిత ఉమేష్ రెడ్డి,ఎంపిటిసి కుమారస్వామి,వార్డు సభ్యులు గ్రామస్థులు అభినందనలు తెలిపారు.
కాగా వారు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య చేతుల మీదుగా ఉత్తమ అధికారులుగా అవార్డులు అందుకున్నారు.