సంపూర్ణ స్వరాజ్యాన్ని అందుకున్న రోజు అంబరాన్ని అంటిన సంబరాలు.

ఉమ్మడి మండలమంతా ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఆటల పోటీలతో వేడుకలు.
ప్రైవేట్ పాఠశాలల్లో గణతంత్ర వేడుకలు కన్నుల పండుగగా.

ప్రభుత్వ,రాజకీయ పార్టీ కార్యాలయాల్లో, కుల సంఘాల ఆధ్వర్యంలో రెపరెపలాడిన 3 రంగుల జెండా.

మహాదేవపూర్- నేటి ధాత్రి:

ఉమ్మడి మండలమంతా ఎక్కడ చూసినా కుల మతాలకు అతీతంగా చిన్నారుల నుండి పెద్దల వరకు కొత్త బట్టలు ప్రతి వ్యక్తి ముఖంలో ఆనందం, ఒకరోజు ముందు నుండి మూడు రంగుల తిరంగా కు వందనాలు చేసే కార్యక్రమాలకు సిద్ధం కావడం జరిగింది. చిన్నారుల నుండి పెద్దల వరకు దేశ ఆత్మ గౌరవం ప్రతి భారతీయుడు గుండెను బాదుకుని గర్వంగా చెప్పే ఆ మూడు రంగుల జెండాకు ఎప్పుడెప్పుడా వందనాలు చేయాలి అన్న తపన మరోవైపు ఉదయం నుండే ఆ పెదవులు గుండె నిండా దేశ ప్రేమను నింపే ఆ జాతీయ గీతం” జన గణ మన అధినాయక జయహే అనే జాతీయ గీతాన్ని ఆలాపన కొరకు వేచి చూడడం జరిగింది ఆ సమయం ఆసన్నం అవడంలో చూస్తుండగానే సూర్యోదయం కావడం చిన్నారుల నుండి పెద్దల వరకు ఆ సందడి ఏ మతాల పండుగకు కూడా రాని ఆనంద ఉత్సాహంతో తిరంగా సలాంకు బయలుదేరి రావడం జరిగింది. ఉమ్మడి మండలమంతా ఉదయం ఏడు గంటల నుండి ప్రారంభమైన జెండా పండుగ ప్రతి ఒక్కరి గుండెల్లో దేశంపై ప్రేమ గర్వంతో మూడు రంగుల జెండాకు వందనాలు సమర్పిస్తూ ఉమ్మడి మండలమంతా జనగణ మారు మోగింది.

సంపూర్ణ స్వరాజ్యాన్ని అందుకున్న రోజు అంబరాన్ని అంటిన సంబరాలు.

శుక్రవారం రోజున భారత 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మండలంలో ఒక పండుగ వాతావరణాన్ని తలపించింది ఉమ్మడి మండలంలోని మ హాదేవపూర్ మండల కేంద్రంతో పాటు పలివెల మండలంలోని 29 గ్రామపంచాయతీలో జాతీయ జెండాను ఆవిష్కరించి గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. 1947 ఆగస్టు 15 స్వతంత్ర భారతదేశం అనంతరం 1950 జనవరి 26 రోజున సంపూర్ణ భారత దేశంగా అవతరించిన రోజు. కానీ 1949 నవంబర్ లోని రాజ్యాంగం పూర్తి అయినప్పటికీ ఒక సంపూర్ణమైనటువంటి రోజు కొరకు ఎదురుచూస్తూ 1950 జనవరి 26న రాజ్యాంగానికి అమలు లో తీసుకురావడం జరిగింది. దేశమంతా వ్యాపారం కొరకు వచ్చి స్థిరపడ్డ ఆంగ్లేయుల చేతిలో రూపకల్పన చేయబడిన చట్టం 1935 చట్టాన్ని గూర్చి పారేసి భారత రాజ్యాంగానికి అమలులోకి తీసుకురావడం జరిగిన రోజు రిపబ్లిక్ డే గా 75 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఒక మహోన్నతమైనటువంటి దినంగా పరిగణంలోకి తీసుకొని దేశ పండుగ గా జరుపుకోవడం జరుగుతుంది. ఆంగ్లేయుల చట్టం నుండి విముక్తి అయి దేశంలో మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రూపు దినటువంటి దేశంతో పాటు ప్రపంచమంతా గర్వించే భారత రాజ్యాం తో సంపూర్ణ మానవ హక్కులు స్వతంత్రంగా తమ హక్కులతో జీవించే విధంగా భారతదేశ ప్రజలకు స్వేచ్ఛనిచ్చిన రోజు గణతంత్ర దినోత్సవం.


ఉమ్మడి మండలమంతా ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.

భారత రాజ్యాంగాన్ని దేశంలో అమరిపరిచిన రోజు 75వ గణతంత్ర దినోత్సవం శుక్రవారం రోజు జరుపుకొనుటకు ఉమ్మడి మండలంలోని ప్రతి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛంద సంస్థలు కుల సంఘాలు ఒక రోజు ముందు నుండే దేశ ప్రజలకు స్వేచ్ఛనిచ్చినటువంటి రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుటకు ఆయా కార్యాలయాలు ఆయా కుల సంఘాల నాయకులు విద్య వైద్య కేంద్రాల్లో గత రెండు రోజుల నుండి గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకొనుటకు ఘనంగా ఏర్పాట్లు చేసుకొని శుక్రవారం రోజున 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను తమ తమ కార్యాలయాల్లో మూడు రంగుల భారత జెండాలు ఎగరవేసి జాతీయ గీతం’ జనగణమన” ఆలపిస్తూ బులు “గణతంత్ర దినోత్సవం వర్ధిల్లాలి” అనే నినాదాలు చేసి మిఠాయిలు పంపిణీ చేసుకుని ఒకరికి ఒకరు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ గణతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది.

ప్రభుత్వ పాఠశాలల్లో ఆటల పోటీలతో వేడుకలు.

రాజ్యాంగం కల్పించిన హక్కు అలాగే దేశంలో రాజ్యాంగం అమలుపరిచిన దినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో కబడ్డీ కోకో ఆటల పోటీలు అలాగే వైజ్ఞానిక వేదిక తోపాటు, పాఠశాలల్లో విద్యార్థుల కళా ప్రదర్శనలు నిర్వహించడం జరిగింది. ఉమ్మడి మండలంలోని కాలేశ్వరం సూరారం అంబటిపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలు అలాగే పలిమెల మండలంలోని పంకిన పలివెల మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆటల పోటీలను నిర్వహించడం జరిగింది. అలాగే మండల కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాల గుడ్ మార్నింగ్ గ్రామర్ హై స్కూల్ తో పాటు గ్రీన్ వుడ్ పాఠశాలల్లో విద్యార్థులు స్వతంత్ర సమరయోధుల దిశాధారణ ప్రత్యేకంగా డాక్టర్ భీమ్రావు బాబాసాహెబ్ వేషధారణ ప్రజలను ఆకట్టుకుంది. విద్యార్థులకు భారతదేశం ఆంగ్లేయుల నుండి విముక్తి అనంతరం దేశంలో సంపూర్ణ రాజ్యాంగం అమలు దేశ పౌరుల యొక్క హక్కులను భారత రాజ్యాంగంలో ఇచ్చిన స్వేచ్ఛ ఇలాంటి వాటిపై గణతంత్ర దినోత్సవం రోజు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు వివరించడం జరిగింది. అనంతరం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో ఆటలు మరియు పాటల పోటీలు అలాగే ఇతర కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను కూడా అందజేయడం జరిగింది. ఉమ్మడి మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఆయా ప్రభుత్వ ఉపాధ్యాయులు కరస్పాండెంట్లు పరేట్ కార్యక్రమాలు విద్యార్థులతో చేయించి జాతీయ జెండాను గౌరవ వందనాలు అందించి విద్యార్థుల్లో దేశం పట్ల మరింత గౌరవాన్ని పెంచే విధంగా కార్యక్రమాలు చేపట్టి విద్యార్థిని విద్యార్థుల సమక్షంలో జెండాను ఆవిష్కరించి గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.

ప్రభుత్వ,రాజకీయ పార్టీ కార్యాలయాల్లో, కుల సంఘాల ఆధ్వర్యంలో రెపరెపలాడిన 3 రంగుల జెండా.

75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఉమ్మడి మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో భారత జెండాను ఆవిష్కరించి గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మహదేవ్పూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ శ్రీపతి బాపు, మండల పరిషత్ కార్యాలయంలో అధ్యక్షురాలు రాణి భాయ్, తాసిల్దార్ లక్ష్మీరాజం, అగ్రికల్చర్ ఏడి ,పిఎసిఎస్ చైర్మన్ చల్లా తిరుపతి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ,ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ చంద్రశేఖర్ ,సబ్ డివిజన్ ఫారెస్ట్ కార్యాలయంలో సబ్ డి ఎఫ్ ఓ, రేంజర్ కార్యాలయంలో ఎఫ్ ఆర్ ఓ, ఐకెపి వెలుగు కార్యాలయంలో ఏపీఓ ,పలిమెల తహసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో ,అలాగే పలివెల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో, పలివెల మండల అధ్యక్షురాలు బుచక్క ,మహాదేవపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్కిల్ కిరణ్, సబ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, డిగ్రీ మరియు జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ లు ,వెటర్నరీ ఆసుపత్రిలో డాక్టర్ రాజబాబు లు జాతీయ జెండాలు ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే మండలంలోని కాంగ్రెస్ మరియు భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాల్లో అధ్యక్షులు అలాగే పార్టీ అనుసంధానం గా ఉన్నటువంటి పలు విద్యార్థి యువజన మహిళ అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యకర్తల అలాగే మండలంలోని కుల సంఘాల నాయకులు ఆయా కార్యాలయాల్లో 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండాలు ఎగరవేసి గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!